
- విధుల్లో నిర్లక్ష్యం వద్దు.. కలిసి పనిచేద్దాం
- రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల, వెలుగు: సిబ్బంది సమస్యల పరి ష్కారం కోసమే పోలీస్‌దర్బార్ నిర్వహిస్తున్నామని రామగుండం పోలీస్‌కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. బుధవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దర్బార్ నిర్వహించారు. ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించేలా చూస్తామన్నారు. ఏమైనా సమస్యలను దర్బార్‌లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే తనను నేరుగా కలిసి చెప్పవచ్చన్నారు.
అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. చెడు స్నేహాలకు అలవాటుపడి విధుల్లో నిర్లక్ష్యం వహించి పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మానసిక, శారీర ఒత్తిడులకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహించి సిబ్బంది, అధికారులు, వారి కుటుంబసభ్యులకు హెల్త్ చెకప్ చేయిస్తామని సీపీ పేర్కొన్నారు.